Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అఫ్గాన్‌పై చర్చకు జి7 దేశాల అత్యవసర సమావేశం

బ్రిటన్‌ : అఫ్గాన్‌ పరిణామాలపై చర్చించేందుకు జీ`7 దేశాల అత్యవసర సమావేశం బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశానికి బ్రిటన్‌తోపాటు అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, జర్మనీ, కెనడా తదితర దేశాలు పాల్గొన్నాయి. ఆగస్టు 31లోగా కాబూల్‌ నుంచి బలగాలను ఉపసంహరించాలన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న జాన్సన్‌ అఫ్గాన్‌ పరిస్థితిపై అత్యవసరంగా చర్చలు జరగాలని ఈ నెల 22న ట్వీట్‌ చేశారు. మానవసంక్షోభాన్ని నివారించేందుకు అంతర్జాతీయ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని బోరిస్‌ సంకల్పించారు. ఆఫ్గాన్‌ నుంచి ప్రజలను సురక్షితంగా వారివారి దేశాలకు తరలించాలని కోరారు. ఈ నెట 31తరువాత కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాలు కాబూల్‌ నగరంలో గమ బలగాలను కొనసాగిస్తాయా అన్న అంశంపై చర్చలు జరుగనున్నట్లు సమాచారం. తాలిబన్లు మాత్రం విదేశీ సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని స్పష్టం చేశారు. ఐరాస సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెర్రస్‌ కూడా జి7 దేశాల సమావేశంలో పాల్గొంటారని ప్రకటన వెలువడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img