Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్చిరంజీవి తల్లికి అస్వస్థత అంటూ వార్తలు… మెగాస్టార్ టీమ్ స్పందన

చిరంజీవి తల్లికి అస్వస్థత అంటూ వార్తలు… మెగాస్టార్ టీమ్ స్పందన

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ విజయవాడలో ఈ రోజు కార్యక్రమాలను, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్తలపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆమెను గత వారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు