Saturday, February 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంమరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలి

మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలి

-ఏ పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్

విశాలాంధ్ర- అనంతపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం అనంతపురము నగరపాలక సంస్థ 5 వ సర్కిల్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ పనిచేస్తూ మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలని గత సంవత్సరం నుండి అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొత్త విధానాలు తీసుకువచ్చి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. పర్మినెంట్ చేయాలన్న ప్రధానమైన సమస్యని పట్టించుకోవడం లేదన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులుగా విధుల్లో చేరి అవుట్సోర్సింగ్ కార్మికులుగానే రిటైర్మెంట్ అవుతున్నారన్నారు. కార్మికుల ఈ పి ఎఫ్,ఈ ఎస్ ఐ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు,15 సం,ల్లో జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకపోవడం వలన పనివత్తిడి పెరిగిపోయిందన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు వెంటనే ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యూ సి జిల్లా అధ్యక్షులు జి.చిరంజీవి,జిల్లా సమితి సభ్యులు శివకృష్ణ,నాగేంద్ర బాబు,తిరుమలయ్య,ఎర్రప్ప,దేవమ్మ,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు