Saturday, February 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంగ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఉన్న రోస్టర్ పాయింట్స్ ను ప్రభుత్వం వెంటనే సవరించాలి

గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఉన్న రోస్టర్ పాయింట్స్ ను ప్రభుత్వం వెంటనే సవరించాలి

జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్
విశాలాంధ్ర- అనంతపురం : అ గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఉన్న రోస్టర్ పాయింట్స్ ను ప్రభుత్వం వెంటనే సవరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు కలెక్టరేట్లో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్ ), గ్రూప్ 2 ఆస్పిరంట్స్ ఐక్యవేదిక నుండి పలువురు అభ్యర్డులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా గ్రంధాలయం నుంచి , వివిధ స్టడీ సెంటర్స్ వద్ద అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంద్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఒంప్రకష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఉన్నాయని. పరీక్షలో జరిగిన తప్పిదాలను సరిచేసి మరొకసారి గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ లోపాల కారణంగా అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని , ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ప్రస్తుత పరీక్షా విధానంలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. వాటిని పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోస్టర్ అమలు చేయడం వల్ల, కొంతమంది అర్హత ఉన్న అభ్యర్థులు అన్యాయానికి గురి అవుతున్నారని అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారన్నారు. ఏండ్ల తరబడి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి ఎగ్జామ్ రోస్టర్ లో తప్పుకున్న కూడా ఎగ్జామ్ నిర్వహించండి అనడం మా నిరుద్యోగుల జీవితాలతో అడుకోవడమే అవుతుందన్నారు. న్యాయం చేయాల్సిన న్యాయ స్థానమే న్యాయబద్ధంగా తీర్పుని ఇవ్వకుండా స్పష్టత లేకుండా ఎగ్జామ్ నిర్వహించండి అనడం ఎంతవరకు భావ్యం అని పేర్కొన్నారు. అభ్యర్థుల రోదన పట్టించుకోని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, ఏపీపీఎస్సీ ఛైర్మన్ పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తప్పులను సరిదిద్దకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-2 పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని, కొత్తగా పరీక్ష నిర్వహించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, జిల్లా నాయకులు శ్రీనివాస్, రాంబాబు, గ్రూప్ టు అభ్యర్థులు నవీన్, ఓంకార్,ఫణి, ఈశ్వర్, బాలాజీ,, తిరుపతయ్య, పెద్ద ఎత్తున అభ్యర్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు