నెతన్యాహు
జెరూసలేం: తమ ఒప్పందం ప్రకారం బందీగా ఉన్న షిరి బిబాస్ మృతదేహాన్ని అప్పగించని హమాస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. షిరి బిబాస్‌తో పాటు మిగతా బందీలు (చనిపోయిన`ప్రాణాలతో ఉన్నవారు) అందరినీ స్వదేశానికి తిరిగి తీసుకు రావాలని ధృఢ సంకల్పంతో ఉన్నట్లు ఉద్ఘాటించారు. ఒప్పందాన్ని క్రూరంగా ఉల్లంఘించినందుకు హమాస్ పూర్తిస్థాయిలో మూల్యం చెల్లించుకోక తప్పబోదని నెతన్యాహు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. హమాస్ గురువారం విడుదల చేసిన నాలుగు మృతదేహాల్లో ఒకటి గుర్తుతెలియని మహిళదని, అది షిరి బిబాస్‌ది కాదని ఇజ్రాయిల్ స్పెషలిస్టులు తేల్చడంతో నెతన్యాహు మండిపడ్డారు.
తన భర్త, ఇద్దరు కుమారులతో సహా 2023, అక్టోబరు 7న అపహరణకు గురైన షిరి బిబాస్ స్థానంలో గాజా మహిళ మృతదేహాన్ని హమాస్ పంపిందని, ఇది చెప్పలేనంత వికారమైన పద్ధతి అంటూ నిప్పులు చెరిగాయి. హమాస్‌ను వదిలిపెట్టేది లేదని, ఇందుకు ఆ సంస్థ పూర్తిస్థాయిలో మూల్యం చెల్లించాల్సిందేనని అన్నారు.
హమాస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే
RELATED ARTICLES