Saturday, February 22, 2025
Homeఅంతర్జాతీయంబొలీవియా అధ్యక్ష రేసులో మొరేల్స్‌

బొలీవియా అధ్యక్ష రేసులో మొరేల్స్‌

లాపాజ్‌: బొలీవియా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు మాజీ అధ్యక్షుడు ఈవో మొరేల్స్‌ ప్రకటించారు. ఆగస్టు 17న సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దృష్ట్యా ఫ్రెంటా పారా లా విక్టోరియా (పీఎఫ్‌వీ) పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడిరచారు. ాఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం్ణ అని కోకాబంబాలో తన మద్దతుదారులనుద్దేశించి మొరేల్స్‌ అన్నారు. చిన్నారికి వేధింపుల కేసులో దర్యాప్తు నడుమ ఎన్నికల్లో పోటీ చేయకుండా మొరేల్స్‌పై నిషేధం ఉంది. రాజ్యాంగబద్ధ ఆదేశాలను ధిక్కరిస్తూ ఎఫ్‌పీవీ నాయకుడు ఎలిసియో రాడ్రిగ్స్‌తో కలిసి ఆయన తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. బొలీవియాలో ప్రజాస్వామిక, సాంస్కృతిక విప్లవం పునరుద్ధరణ దిశగా అడుగులు వేసేందుకు పోటీలోకి దిగుతున్నట్లు చెప్పుకున్నారు. అయితే వీరి మధ్య కుదిరిన పొత్తు ప్రకారం ఎఫ్‌పీవీ తరపున ఏకైక అధ్యక్ష అభ్యర్థిగా మొరేల్స్‌ ఉంటారు. ఉపాధ్యక్షుడిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు