Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించిన ప్రజలు..

ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించిన ప్రజలు..

పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం 257,258వ బూత్ ల నందు ప్రజలతో కలిసి వీక్షించడం జరిగినది అని బిజెపి పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అందులో భాగంగా వన్యప్రానులను మనం సంరక్షించుకోవాలి, రానున్న పదవ తరగతి , ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు నరేంద్ర మోడీ వినూత్నంగా ప్రారంభించిన పరీక్ష పై చర్చ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా చూడాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సాకే ఓబులేసు,బూత్ అధ్యక్షుడు భాస్కర్, మన్ కి బాత్ కార్యకర్త రామాంజి, శీలా ప్రసాదు, ఎల్లపు రామకృష్ణ,మామిళ్ల రంగయ్య , పురుషోత్తం, నరేష్, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు