Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైద్యులు సేవాభావంతో తమ విధులను నిర్వర్తించినప్పుడే ప్రజలలో మంచి గుర్తింపు

వైద్యులు సేవాభావంతో తమ విధులను నిర్వర్తించినప్పుడే ప్రజలలో మంచి గుర్తింపు

రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు.. డాక్టర్ సంకారపు నరసింహులు.
విశాలాంధ్ర ధర్మవరం; వైద్యులు సేవాభావంతో తమ విధులను నిర్వర్తించినప్పుడే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభ్యమవుతుందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో గల వారి స్వగృహంలో పట్టణంలోని వైద్యులకు, ఇతరులకు “కంప్యూటర్ వినియోగము-కంటి జాగ్రత్తలు”పై అవగాహన సదస్సును నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు సాంకేతికంగా అభివృద్ధి చెంది చాలామంది జీవితాలలో కంప్యూటర్ వినియోగం ఒక అంతర్భాగము అయిందని, దీర్ఘకాలం ఏకధాటిగా వినియోగిస్తే కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అలా కాకుండా కంటి పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. కంటికి కలిగే ఇబ్బందులు లో కళ్ళు పొడిబారడం, కంటినొప్పి, తలనొప్పి, కళ్ళు ఎర్రబాలడం, నీరు కారుట, వెలుగును చూడలేక పోవడం లాంటివి కలుగుతాయని తెలిపారు. ఏకధాటిగా కంప్యూటర్ను చూస్తుండడం వలన కంటి రెప్పలు ఆర్పడం తగ్గిపోతుందని అందువల్లనే కన్నీటి ప్రవాహం తగ్గి ,కంటి తడి ఆరిపోతుందని తెలిపారు. కంప్యూటర్ స్కీం తగినంత దూరంలో ఉంచాలని దగ్గరగా, దూరంగా కూడా ఉండకూడదు అని తెలిపారు. కంప్యూటర్ గదిలో కాంతి సమంగా ఉండేటట్లు చూసుకోవాలని ఏకధాటిగా కంప్యూటర్ చూడకుండా ప్రతి 20 నిమిషములకు, 20 సెకండ్లకు, 20 అడుగుల దూరం చూస్తూ 20 సార్లు కంటి రెప్పలను ఆర్పాలని తెలిపారు. తరచుగా కృత్రిమ కన్నీటి చుక్కల మందులను డాక్టర్ సలహాతో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది అని వారు తెలిపారు. ఇటువంటి విషయాలను వైద్యులందరూ కూడా గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వారు కోరారు. అనంతరం పలువురు డాక్టర్లను, దంపతులు డాక్టర్ సంకారపు నరసింహులు, జయశ్రీ లు, హాజరైన వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డాక్టర్ జగన్మోహన్, రెడ్ క్రాస్ అనంతపురం కార్యదర్శి మోహన్ కృష్ణ, విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్లమరం చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర, జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయ శ్రీ, డాక్టర్లు సుధాకర్ రావు, వెంకటేశులు, కుళ్లాయప్ప, ప్రసాద్ రెడ్డి, పద్మజ, నీరజ, మోహన్ కృష్ణ, వెంకటరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు