చుండి ఆదర్శపాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశం నకు దరఖాస్తు చేసుకోండి.. ప్రిన్సిపాల్
విశాలాంధ్ర వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం చుండి ఆదర్శపాఠశాలలో 2025-26 సంవత్సరం నకు 6వ తరగతి ప్రవేశమునకు ఈ నెల 24-2-2025 నుండి 31-3-2025 వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకువాలని చుండి ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్ పడమటి శ్రీవెంకటేశ్వర్ తెలియజేశారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వం చే గుర్తింపుబడిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అని తెలియజేశారు. ఓసి, బిసి అభ్యర్థులు (1-09-2013నుండి 31-8-2015 మధ్య జన్మించి ఉండాలని పీజు 150 రూపాయలు అని అన్నారు.ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు 1-9-2011నుండి 31-8-2015 మధ్య జన్మించి ఉండాలని పీజు 75 రూపాయలు అని అన్నారు. పీజు ఈ -సేవా మరియు ఏపీ ఆన్ లైన్ www.apms.apcfss ద్వారా చెల్లించి ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నందు దరఖాస్తు చేసుకొని ఆ దరఖాస్తు తో పాటు ఆధార్, రేషన్ కార్డు, ఫొటో, స్టడీ సర్టిఫికెట్ జెరాక్స్ కాపీలను పాఠశాల నందు ప్రిన్సిపాల్ కు అందజేయాలనిఅన్నారు.20-4-2025 తేదీన పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని అన్నారు.మరిన్ని వివరముల కొరకు 9440929729,8184854200,8074551521ఈ ఫోన్ నెంబర్ల ను సంప్రదించాలని అన్నారు.