Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. భూకబ్జా కేసు నమోదు

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. భూకబ్జా కేసు నమోదు

ఇప్పటికే కిడ్నాప్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు తాజాగా భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. మరోవైపు వంశీ చేసిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే… వంశీకి నలువైపుల నుంచి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు