త్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో… విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. వంశీ రిమాండ్ ను పొడిగించాలని కోర్టును పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. మరోవైపు, ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో నాలుగు సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని షరతు విధించింది. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకువెళుతున్నారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమవుతుంది.
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు.. కస్టడీకి తీసుకున్న పోలీసులు
RELATED ARTICLES