కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రతి విద్యార్థిని చదువు పట్ల మరింత శ్రద్ధను కనపరచాలని కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సరస్వతీ పూజను విద్యార్థినీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇష్టపడి, కష్టపడి చదివినప్పుడే మంచి ఉత్తీర్ణతతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం కూడా కళాశాలలకు ఎంతో చేత ఇస్తోందని తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణములో ఏర్పాటు చేస్తున్న షెడ్డు నిర్మాణానికి విశ్రాంత కామర్స్ అధ్యాపకులు వసంతకుమారి మూడు లక్షలు, బండి లక్ష్మీదేవి రెండు లక్షల 50 వేలు విరాళం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలను ప్రత్యేకంగా ఘనంగా అనంతరం విద్యార్థినీలు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రతి విద్యార్థి చదువు పట్ల మరింత శ్రద్ధను కనపరచాలి..
RELATED ARTICLES