ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర బడ్జెట్ లో చేనేతరకు రెండువేల కోట్లు కేటాయించాలని కోరుతూ ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు ఆర్డిఓ మహేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉందని ఈ కారణంగా చేనేత కార్మికులకు పనులు లేక చేసినఅప్పులుతీర్చలేక ఆకలి చావులకు ఆత్మహత్యలకు గురవుతున్నారు అని తెలిపారు. సహకార సంఘాలు కార్మికులకు పని చూపించలేని పరిస్థితిలోకి వెళ్లినవి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు, ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు నేతన్న నేస్తం 24 వేల రూపాయల నుండి 36వేల రూపాయలు పెంచి నేతన్న నేస్తం కు కూడా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వము ఆలోచించి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి, చేనేతల డిమాండ్లను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల డిమాండ్ల వివరాలను నాయకులు తెలుపుతూ
రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి 2000 కోట్ల రూపాయలునిధులు కేటాయించాలి అని,. సహకార సంఘాలకు రావలసిన షు మారు172 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి అని, సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి అని, సొంత మగ్గం ఉన్నవారితో పాటు ఉపవృత్తుల వారికి కూడా ఇవ్వాలి అని, చేనేత రిజర్వేషన్ యాక్ట్ ను కఠినంగా అమలు చేయాలి అని, ప్రతి జిల్లాలోనూ చేనేత పార్కులను ఏర్పాటు చేయాలి అని తెలిపారు. పండుగ సందర్భంలో ఆప్కో ద్వారా 40 శాతము రిబేటును చేనేత వస్త్రాలపై ఇవ్వాలి అని, చేనేత సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర చేనేత శాఖ మంత్రి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలతో ప్రతి మూడు మాసాలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల తోటి ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేనేత సమస్యలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, పి. శ్రీనివాసులు, పాలగిరి శ్రీధర్, సిరివెళ్ల దేవా, సి. శ్రీనివాసులు, బాల రంగయ్య, జింక కేశవ, ద్వారక అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు రెండువేల కోట్లు కేటాయించాలి…
RELATED ARTICLES