Saturday, April 19, 2025
Homeజిల్లాలుకర్నూలుప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీఓ ను సస్పెండ్ చేయాలంటూ మంగళవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించడంలో ఎంపీడీఓ విఫలం చెందారని ఆరోపించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకోరావాలని కలెక్టర్ అంటుంటే ఇక్కడి ఎంపీడీఓ నాగరాజు స్వామి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. బీసీ కార్పొరేషన్ నిధులను అర్హులైన నిరుద్యోగలకు కేటాయించాలని, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్న ఎంపీడీఓ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పెద్దకడబూరుకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ నాగరాజు స్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరాంజనేయులు, తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, నర్సింహులు, నాగేంద్ర, నాగేష్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు