Tuesday, February 25, 2025

ఘనంగా రోటరీ డే..

రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు నాగరత్నమ్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ కమిటీతోపాటు మాజీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రోటరీ డే యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, ఇన్నర్ బిల్ క్లబ్బు అధ్యక్షురాలు నాగరత్నమ్మ, సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రోటరీ డేను జరుపుకోవడం మనందరికీ సంతోషదాయకమని తెలిపారు. అనంతరం రోటరీ డే యొక్క ప్రాధాన్యతను వారు తెలియజేస్తూ, రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు, సమాజానికి మరిన్ని సేవలను అందించాలని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధితోనే నేడు ఈ క్లబ్బులు నడుస్తున్నాయని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నాట్య ప్రదర్శన, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తొలుత రోటరీ డే సందర్భంగా కేకును కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ నరసింహులు, సోలిగాల వెంకటేశులు, కొండయ్య, ఇన్నర్ ఫీల్ క్లబ్బు మాజీ అధ్యక్షులు సంకారపు జయ శ్రీ తో పాటు 50 మంది రోటరీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు