జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా చర్యలను, లాక్ బుక్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ల వద్ద సెక్యూరిటీ లాక్ బుక్ లు అందరికీ అర్థమయ్యేలా నమోదు చేయాలన్నారు. లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలను చేపట్టాలని ఏఎస్ఐని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి దేవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, తదితరులు పాల్గొన్నారు.