Wednesday, February 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఫ్యూచర్ మేకర్స్ ఫెయిర్ కార్యక్రమం..

ఘనంగా ఫ్యూచర్ మేకర్స్ ఫెయిర్ కార్యక్రమం..

పాఠశాల కరెస్పాండెంట్స్ రిన్సీ సిస్టర్. హెడ్మాస్టర్ సుజాత సిస్టర్
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణములోని సిద్దయ్య గుట్ట వద్దగల జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో ఫ్యూచర్ మేకర్ ఫెయిర్ అను కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ రిన్సీ సిస్టర్, హెడ్మాస్టర్ సుజాత సిస్టర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు నైపుణ్యం తో పాటు గణితము ,సామాన్య శాస్త్రములకు సంబంధించినటువంటి విషయాలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. విద్యార్థులు రకరకాల అయినటువంటి ప్రాజెక్టు మోడల్స్ తో ప్రదర్శన అందర్నీ ఆకట్టుకోవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. దాదాపుగా 500 మంది విద్యార్థులకు పైగా పాల్గొని, 240కు పైగా సైన్స్ మ్యాథమెటిక్స్ ప్రాజెక్ట్ మోడల్స్ ను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్ట్ మోడల్స్ ను పరిశీలించి ప్రతిప గణపరిచిన గెలిచిన వారికి పాఠశాల హెడ్మాస్టర్ అండ్ కరెస్పాండెంట్ వారు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, బోధ నేతల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు