Wednesday, February 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా శివరాత్రి ఉత్సవ వేడుకలు

ఘనంగా శివరాత్రి ఉత్సవ వేడుకలు

శివానగర్ శివాలయం అభివృద్ధి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శివానగర్లో గల బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రమౌళి శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు వివిధ అభిషేకాలు, చక్కటి అలంకరణ చేసిన వైనం భక్తాదాలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి పూజలు అనంతరం శివపార్వతులను రథముపై ఆశీనులు చేసి మడుగు తేరుగా, అదేవిధంగా రథోత్సవ కార్యక్రమాన్ని వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇంత ఇంచార్జ్ హరీష్ బాబు తదితరులు పాల్గొని రథోత్సవాన్ని లాగి ప్రారంభించారు. లింగోద్భవ కాలమునందు 9 రకాల పండ్లతో విశేష అభిషేకాలను కూడా నిర్వహించారు. నుండి అర్ధరాత్రి వరకు వివిధ అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ వేడుకలను తినిపించడానికి వేలాదిమంది భక్తాదులు, దాతలు, పట్టణ ప్రముఖులు వీక్షించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణము బయట, శివానగర్లలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారు మజ్జిగ ,నీరును భక్తాదులకు పంపిణీ చేశారు. వివిధ దుకాణాలు కూడా వెలిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దాసరి గంగయ్య, ఉపాధ్యక్షులు తులసీదాస్, గౌరవాధ్యక్షులు పాంశెట్టి శివశంకర్, కోశాధికారి గుండా ధనుంజయ తో పాటు పరిచే సుధాకర్, నీలూరు అశ్వత్ నారాయణ, గిరాజ రవి, గుండా పుల్లయ్య, డోలా రాజారెడ్డి, జింక చంద్రశేఖర్, భక్తాదులు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు