విశాలాంధ్ర వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెం పంచాయతీలో మహాశివరాత్రి పండగ పురస్కరించుకొని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు
ముందుగా ఆలయ నిర్వాహకులు, వేద పండితులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గం సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నానన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కార్తీక్, మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, దామా మల్లేశ్వరరావు కాకుమాని హర్ష, కాకుమాని ఆంజనేయులు, వలేటి నరసింహం, గుత్తా మహేశ్వరరావు,వలేటి మధు,వలేటి శ్రీధర్ నాయుడు, మన్నం మాధవరావు, గుత్తా కొండయ్య, ప్రగడ శ్రీనివాసులు, రామచంద్రా రెడ్డి,మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు…