Thursday, February 27, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఈరోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉండ‌వ‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లోని పోలింగ్ కేంద్రంలో చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ ఓటు వేశారు. ఇక ఈ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. అయితే, వీరిలో కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు (పీడీఎఫ్‌), ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ (కూట‌మి) మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు