Thursday, February 27, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్…

ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా జిల్లాలు… ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఉండవల్లిలోని పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు వేయలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ గ్రాడ్యుయేట్ కాదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. మరోవైపు, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ పవన్ ఓ వీడియోను విడుదల చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు