విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని మొదటి మరుగు చెరువు కట్ట వద్ద గల శ్రీ చక్ర సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయములో శివరాత్రి పండుగ రోజున భక్తాదుల చేతుల మీదుగా శివుడు పూజలు అందుకున్నారు. ఈ కార్యక్రమం హట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వివిధ పూలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలో మహిళలు దీపోత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ పూర్వీకులైన హట్టి కుటుంబ సభ్యులచే శివరాత్రి వేడుకల నిర్వహణ సంతోషదాయకమని భక్తాదులు తెలిపారు.
శివరాత్రి రోజున విశేష పూజలు అందుకున్న శివుడు
RELATED ARTICLES