మార్చి 14న విశాఖ ప్రైవేటీకరణ పై ఆందోళనలు…
సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : ఇంటి నిర్మాణాలకు 10 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని మార్చి 14న విశాఖ ప్రైవేటీకరణ పై ఆందోళనలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ఇంటి పట్టాల విషయంలో చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంటు ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. పేదల ఇంటి నిర్మాణాలు కోసం పరిష్కారం కావాలంటే పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. 32 మంది బలిదానాలు దాదాపు కమ్యూనిస్టు పార్టీల త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపించబడిందన్నారు. 2 లక్షల కోట్ల ఆస్తిని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు నామ మాత్రం బడ్జెట్ కేటాయించి తాత్కాలిక ఉపశమనం తప్ప దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి ప్రయత్నించాలన్నారు. విశాఖ ఉక్కు గనుల కేటాయించకుండా అప్పుల్లో తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. కేంద్రం,రాష్ట్రం లో ఉండే ఎన్డీఏ కూటమి నాయకుల విశాఖ గేటు వద్ద వచ్చి కార్మికులకు భరోసా కల్పించాలన్నారు. మార్చి 14న వామపక్ష పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ బిజెపి ఆర్ఎస్ఎస్ సంఘ పార్టీలు మంచి మెజారిటీ రావడంతో రాజ్యాంగం మారుస్తామని మనవాద సిద్ధాంతాన్ని తీసుకురావడం జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశాన్ని అణిచివేయడానికి దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతోందన్నారు. ముస్లిం మైనారిటీలు, దళితులు, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయి అన్నారు. లౌకికవాదం, సామ్యవాదం, పదాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతోందన్నారు. మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14వ తేదీ రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ప్రజా కార్యక్రమాలు చేపడతామన్నారు. రాయలసీమ జిల్లా హెచ్ఎంఎస్ఎస్ సంబంధిత హంద్రీనీవా 6 లక్షల నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి మహత్తరమైన పథకం అన్నారు. పదివేల క్యూసెక్కుల నీరు కావాలంటే కాలవ వెడల్పు చేయాలన్నారు. ఆయకట్టుకు నీరు ఇవ్వాలని బడ్జెట్లో పిల్ల కాలువలు తవ్వడానికి నిధులు కేటాయింపు జరగాలన్నారు. జి ఎన్ ఎస్ ఎస్, గాలేరు నగరి,వెలుగొండ సంబంధిత ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించాలన్నారు. వలసలు పోతున్న రైతులను ఆపాలని వారికి ఉపాధి పనులు పెట్టి వ్యవసాయ కూలీలకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అతి తక్కువ వర్షపాతం ఉన్న రాయలసీమ కరువు జిల్లాల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బడ్జెట్ కేటాయించాలన్నారు. బడ్జెట్ కేటాయింపు అయిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శిలు పి. నారాయణస్వామి, సి.మల్లికార్జున, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, అనంత నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, సహాయ కార్యదర్శి అలిపిర, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.