: శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి తో పాటు సంతోషం కూడా కలదని శ్రీ సత్య సాయి సేవ సమితి-2 సుబ్బదాసు భజన మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల 110 మంది రోగులకు పాలు, బ్రెడ్లు ,బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా సందేశం ప్రకారం తాము ఈ సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సాయి సేవలో దాతగా ఎక్కాల సత్యనారాయణ కుటుంబ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ సుబ్బ భజన మందిరం వారు చేస్తున్న ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతాయని తెలిపారు. ఇలాంటి సేవలు రోగులకు వరం లాగా మారడం నిజంగా సంతోషదాయకమని తెలిపారు. తదుపరి నిర్వాహకులకు ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు.
రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి, సంతోషం
RELATED ARTICLES