Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅబ్బురపరిచిన నాట్య ప్రదర్శన.. గురువు బాబు బాలాజీ, రామలాలిత్యా

అబ్బురపరిచిన నాట్య ప్రదర్శన.. గురువు బాబు బాలాజీ, రామలాలిత్యా

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని శివానగర్లో గల బ్రహ్మంగారి ఆలయంలో శివరాత్రి కళ్యాణ్ ఉత్సవం సందర్భంగా పట్టణములోని శ్రీ లలిత నాట్య కళానికేతన్ విద్యార్థులు నిర్వహించిన నాట్య ప్రదర్శన అందరినీ అబ్బుర పరిచిందని గురువు బాబు బాలాజీ ,రామ లాలీత్య తెలిపారు. దాదాపు 20 మందికి పైగా ఈ నాట్య ప్రదర్శన చేసిన తీరు భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు ఓబులేసు మాట్లాడుతూ ఈనాట్య ప్రదర్శన ఎంతో సంతోషదాయకమని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించడం శుభదాయకమని తెలిపారు. తదుపరి చిన్నారులకు బహుమతులను పంపిణీ చేస్తూ, గురువులను ఆలయం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు