Monday, March 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా సైన్స్ డే కార్యక్రమాలు.. కరెస్పాండెంట్ శంకర్ నాయుడు

ఘనంగా సైన్స్ డే కార్యక్రమాలు.. కరెస్పాండెంట్ శంకర్ నాయుడు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సైన్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ శంకర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదుల సంఖ్యలో సైన్స్ డే ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, డాక్టర్ సుబ్బారావు, వన్ టౌన్ ఎస్ఐ కేతన్ విచ్చేసి సైన్స్ డే కార్యక్రమాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరివారు సివి రామన్ గూర్చి విద్యార్థులకు వివరించారు. తదుపరి ప్రతిభ కనపరిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లల మనసు నిత్యం ప్రయోగాలకు, వారి బుద్ధి వికాసానికి ఇది చాలా ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ సైన్స్ డే లో మొదటి బహుమతిగా వాటర్ లెవెల్ డిటెక్టర్ 9వ తరగతి విద్యార్థులను ఎంపిక కాగా, రెండవ బహుమతిగా స్టేట్స్ వాటి క్యాపిటల్ ఎనిమిదవ తరగతి విద్యార్థులు, మూడవ బహుమతిగా రెస్పిరేటరీ సిస్టం 9వ తరగతి విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా విద్యార్థులకు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు