Tuesday, March 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్‌

ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్‌

శాస‌న మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్‌ సమాధానం
ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై శాస‌న మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు ఈరోజు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే.. 2,60,194 పోస్టులు భర్తీ చేశారు. అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఒక్క టీడీపీ హయాంలోనే 70 శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం చేశాను. అందులో భాగంగానే 02-07-24 తేదీన టెట్ నిర్వహించడం జరిగింది. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 1.87 లక్షల మంది అర్హత సాధించారు. 03-10-24 నుంచి 21-10-24 వరకు టెట్ పరీక్షను పూర్తిచేయడం జరిగింది. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నా. ప్రతిపక్ష పార్టీ నేతలు నా శాఖకు సంబంధించి ప్రశ్నలు వేసి.. చర్చించేందుకు సిద్ధంగా లేరని, ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలిఁ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు