ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం
పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపు
ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపొందారు. ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే.
తన విజయం పట్ల పేరాబత్తుల హర్షం
ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రెండు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని పేరాబత్తుల దుయ్యబట్టారు.