Tuesday, March 4, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరివిద్యార్థి స్థాయి నుంచే సేవాభావం, క్రమశిక్షణ కలిగి ఉండాలి

విద్యార్థి స్థాయి నుంచే సేవాభావం, క్రమశిక్షణ కలిగి ఉండాలి

విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్ : విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, సేవాభావం కలిగి ఉండాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యాంసుందర్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీఎం శ్రీ స్కూల్స్ కు భారత్ స్కౌట్ అండ్ గైడ్ కు విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్కౌంట్స్, గైడ్స్, ఉపాధ్యాయులకు బేసిక్ కోర్స్ స్కౌట్స్ మాస్టర్స్ గైడ్ కెప్టెన్ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి 24 పాఠశాలలు, ఏలూరు జిల్లా నుంచి 26 పాఠశాలలు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు. ప్రతి స్కూలు నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు హాజరుకానున్నట్లు వివరించారు. విద్యార్థులందరూ స్కౌట్స్ అండ్ గైడ్ కార్యక్రమంలో చేరి దేశానికి మంచి సేవ చేయాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్ సెక్రటరీ ఉంగరాల నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి వి. హనుమ, ప్రిన్సిపల్ బి. రాజారావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు