Tuesday, March 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినవోదయం పోస్టర్లను విడుదల చేసిన అధికారులు…

నవోదయం పోస్టర్లను విడుదల చేసిన అధికారులు…

విశాలాంధ్ర -ధర్మవరం ; ఎక్సైజ్ ప్రభుత్వ విభాగానికి సంబంధించిన నవోదయం పోస్టర్లను ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో మహేష్ తో పాటు పుట్టపర్తి ఎక్సైజ్ సూపర్డెంట్ గోవింద నాయక్, అనంతపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మంగు శ్రీరామ్, ధర్మవరం ఎక్సైస్ సీఐ చంద్రమణి, ఎస్సై చాంద్ బాషా, సికేపల్లి ఎక్సైజ్ సీఐ ఫరూక్ అజాం తదితరులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ పుట్టపర్తి ఎక్సైజ్ సూపర్డెంట్ గోవింద నాయక్ మాట్లాడుతూ నాటు సారా ఎందుకు ప్రమాదం? నాటు సారా వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్యంపై దుష్ప్రభావాలు, కుటుంబం పై దుష్ప్రభావాలు, ఆర్థిక దుష్ప్రభావాలను ప్రజలకు పూర్తీ దశలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడ కూడా నాటు సారా తయారు కాకూడదని, అలా తయారైతే అమ్మకం దారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. చట్ట ప్రకారం కఠిన శిక్షలతో పాటు కేసులు, జైలు శిక్ష లాంటి విషయాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. నాటు సారా మానేద్దాం- ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్నస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలిపారు. నాటు సారా పై ప్రజల్లో అవగాహన కలిగించి నియోజకవర్గంలో నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వము నవోదయం అనే కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ నవోదయం ద్వారా గ్రామాలు, పట్టణాలలో అవగాహన సదస్సులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు