విశాలాంధ్ర- ధర్మవరం:: న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ నుండి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ జూజారునాగరాజుకు ఆహ్వానం అందినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందడం సంతోషదాయకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేనేతను ప్రోత్సాహం కలిగించుటకు వివేదితకా అమృత్ మహోత్సవంలో భాగంగా మన ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రదర్శనలో నాకు ఎక్స్పో నిర్వహణకు కూడా రావడం సంతోషదాయకం అని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ విందుకు కూడా తాను వెళ్లడం జరిగిందని, ఇది జీవితంలో మరుపురాని ఘటన అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ధర్మవరం పట్టుచీరల ప్రత్యేకతలను తెలుపుట ఎంతో గొప్ప విషయము అని తెలిపారు. అంతేకాకుండా చేనేత కార్మికుల కష్టసుఖాలను కూడా తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూజారు నాగరాజు తో పాటు చిప్పల మార్కండేయ కూడా పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్రపతి నుండి ఆహ్వానం అందుకున్న ధర్మవరం డిజైనర్ జూజారు నాగరాజు
RELATED ARTICLES