రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: రూరల్ పరిధిలోని వాహనదారులందరూ కూడా వాహనాల నియమ నిబంధనలు, చట్టాన్ని తప్పక పాటించాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని కొనుటూరు గ్రామ సమీపములో వాహనాల తనిఖీలను నిర్వహించారు. అనంతరం వాహనదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతనంగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టము, జరిమానా గూర్చి తెలియజేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కొత్తగా అమలు కానున్న మోటార్ వెహికల్ జరిమాణాలు కూడా తప్పక వేయబడునని తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి మోటార్ వాహనాల చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. అనంతరం జరిమానాల వివరాలను తెలియజేస్తూ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు, వాహనంలో వెనక కూర్చున్న వ్యక్తికి కూడా శిరస్రానం తప్పనిసరి అని లేనియెడల వెయ్యి రూపాయలు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వేయి రూపాయలు, వాహనానికి బీమా లేకపోతే 1000 రూపాయలు, రెండోసారి పట్టుబడితే 2000 రూపాయలు, శబ్దం/పొగా కాలుష్యం చేస్తే 2000 రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు, డేంజరస్ పార్కింగ్ వద్ద వాహనము ఉంచితే 1500 రూపాయల నుండి 3వేల రూపాయల వరకు, ఓవర్ స్పీడ్ అనగా రేసింగ్ వెళితే 5000 రూపాయలు, డేంజరస్ డ్రైవింగ్ చేస్తే పదివేల రూపాయలు, మైనర్లు డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమాణాలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులను రవాణా వాహనాలలో ఎక్కిస్తే మనిషికి ₹200 చొప్పున జరిమాణాలు తప్పక విధిస్తామని తెలిపారు. కావున వాహనదారులు పై తెలిపిన నూతన చట్టాన్ని గౌరవిస్తూ సహకరించాలని తెలిపారు.
వాహనాల నియమ నిబంధనలు తప్పక పాటించాలి
RELATED ARTICLES