Thursday, March 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంఉపాధి హామీల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలి

ఉపాధి హామీల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలి

గ్రామాల్లో బోగస్ మస్టర్ బిల్లులపై దృష్టి పెట్టండి డి డబ్ల్యూ ఎం, ఏ. ఏ పి డి సుధాకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కేశవరెడ్డి

విశాలాంధ్ర- అనంతపురం : ఉపాధి హామీల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలని, గ్రామాల్లో బోగస్ మాస్టర్ బిల్లులపై దృష్టి పెట్టాలని డిడబ్ల్యూ ఎం. ఏ, ఏ పి డి సుధాకర్ రెడ్డి కి బుధవారం వినతి పత్రాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టి.రంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కేశవరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చాలా గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి వలసలు వెళ్లడం జరుగుతోందన్నారు. వ్యవసాయ కూలీలకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టంను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. జిల్లాలలో వర్షాలు సరిగా లేకపోవడంతో ఉన్న గ్రామాలలో పనులు దొరకకపోగా బ్రతకడం కోసం అప్పులు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు . ఈ అప్పులు తీర్చడానికి ఉన్న గ్రామాలలో పనులు లేవు. దీంతో జీవనం కోసం ఇతర పక్క రాష్ట్రాలకు వలసల బాట పట్టారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులలో మార్పు రావడం లేదన్నారు. వామపక్షాలు మరియు వామపక్ష మేధావులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీల శ్రేయస్సు కోరుకునేవారి పోరాటాల ఫలితంగా 2005 సంఁలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా నివారించడం జరిగిందన్నారు. వ్యవసాయ కూలీలకు ఉ న్న గ్రామాలలో పని కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న తరుణంలో రాజకీయ జోక్యంతో నిర్వీర్యం అవుతున్నది. పూర్తి స్థాయిలో పనులను కూలీలందరికి కల్పించకపోవడంతో లక్షల సంఖ్యలో కూలీలు జీవనం కోసం వలసలు పోతున్నారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి. వలసలు నివారించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం రూ. 700 ఇవ్వాలన్నారు.
జాబ్ కార్డులో వున్న అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు 200 రోజులు పని దినాలు ఇప్పించాలన్నారు . ఉపాధి హామీలో చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించాలి. జిల్లాలో ఇప్పటికే చేసిన పనికి 9 వారాల పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. ఉపాధి హామీలో రాజకీయ జోక్యాన్ని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలన్నారు. ఇప్పటికే గ్రామాలు వదిలి వలసలు వెళ్లిన వారిని తిరిగి గ్రామాలకు రప్పించి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో తీసివేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలన్నారు.
జిల్లాలో అనేక గ్రామాల్లో బోగస్ మస్టర్లు వేసి బిల్లులు చేసుకోవడం జరుగుతోందన్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలని, శింగనమల మండలంలో ఉపాధి హామీపథకం టిఎగా పనిచేస్తున్న నారాయణ స్వామిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంలో రాజకీయ జోక్యాన్ని నివారించి, వలసలు ఆపాలని వినతిపత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెనరాయుడు, బండారు శివ, పెరుగు సంగప్ప, కైరంబి, రామలక్ష్మమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు