బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు జొప్పించేందుకు ఆర్బీఐ చర్యలు
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకు నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీల కొనుగోలు, డాలర్, రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో మొత్తం రూ.1.9 లక్షల కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పది బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్ ఉ రుపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించిన ఆర్బీఐ .. లిక్విడిటీని మరింత పెంచాలని మరోసారి చర్యలు తీసుకుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మొత్తం రూ.1 లక్ష కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. రూ.50వేల కోట్ల చొప్పున రెండుసార్లుగా మార్చి 12, మార్చి 18 తేదీల్లో ఈ సెక్యూరిటీస్ కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మార్చి 24న మరో పది బిలియన్ డాలర్ల యూఎస్డీ, ఐఎన్ఆర్ బై, సెల్ స్వాప్ వేలాన్ని కూడా నిర్వహించనుంది. నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపారు.
ఆర్బీఐ కీలక నిర్ణయం
RELATED ARTICLES