Thursday, March 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన తారక్ చేయూత ట్రస్ట్

పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన తారక్ చేయూత ట్రస్ట్

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని వైయస్సార్ కాలనీలో నివాసముంటున్న కీర్తిశేషులు పుల్లప్ప కుటుంబానికి తారక్ చేయూత ట్రస్ట్ వారు ఒక నెలకు సరిపడు నిత్యావసర సరుకులను (సరుకు విలువ 6000) అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వైయస్సార్ కాలనీలో భర్త పుల్లప్ప, బార్య కళావతి, కుమారుడు వంశీ నివాస ఉంటున్నారు. అనుకోకుండా భర్త పుల్లప్ప జీవనోపాధి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం కుటుంబం పెద్దదిక్కు పోవడంతో తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం స్థానికులు తారక్ యిత ట్రస్ట్ కు తెలియజేశారు. సమాచారాన్ని అందుకున్న అక్కడకు చేరుకొని తమ వంతుగా నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. మృతుడు పుల్లప్ప చేనేత వ్యవస్థపై ఆధారపడి మగ్గం నేర్చుకుంటూ జీవనం పొందేవాడు. హఠాత్తుగా పక్షపాతం రావడంతో కుటుంబం చినాభిన్నమయింది. పక్షపాతంతో మగ్గం పని చేయలేక, ఇల్లు గడవక మనస్థాపం చెంది పెద్దదిక్కు అయినా పుల్లప్ప ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగిందని ట్రస్ట్ వారు తెలిపారు. ఏది ఏమైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల తమకు ఎంతో సంతృప్తి సంతోషం కలిగిందని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యులు తారక్ చేయుట ట్రస్టుకు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు