ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య
ఏఐఎస్ఓ రాష్ట్ర నాయకులు నిరంజన్,
ఏ ఐ ఎస్ బి జిల్లా అధ్యక్షులు జగదీష్.
విశాలంద్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పలు పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో పాటు పెద్దపెద్ద ఫ్లెక్సీలతో పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, ఏఐఎస్ఓ రాష్ట్ర నాయకులు నిరంజన్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్ మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే పలు పాఠశాలల యాజమాన్యం కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు. తల్లిదండ్రులను మభ్యపెడుతూ వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అసలే కరువు జిల్లా అయినప్పటికీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులే ఉన్నందున మోసపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. కాబట్టి తక్షణమే పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగిస్తూ అక్రమ అడ్మిషన్లు కు పాల్పడుతున్న ప్రైవేటు విద్యా సమస్యలపై వేలు వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఓ జిల్లా కార్యదర్శి నవీన్, ఏఐఎస్బి నాయకులు భరత్, కిషోర్, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యా సంవత్సరం ముగియకనే పట్టణంలో పలు పాఠశాలలు చేస్తున్న అడ్మిషన్లను అడ్డుకోండి..
RELATED ARTICLES