Thursday, March 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టాల్లో అవకతవకలపై విచారణ జరిపించాలి

పట్టాల్లో అవకతవకలపై విచారణ జరిపించాలి

పట్టాల్లో అధికారులు చేసిన అవకతవకలపై విచారణ జరిపించాలి

21 వ ప్లాట్లో బినామీ పేరు తో అమ్మకాలు జరిపిన తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి…

సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రీ సర్వే నెంబర్ 650లో ప్లంబర్ కి ఇచ్చిన పట్టాల్లో అధికారులు చేసిన అవకతవకలపై విచారణ జరిపించాలని, 21వ ఫ్లాట్లో బినామీ పేరుతో అమ్మకాలు జరిపిన తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డిఓ కార్యాలయంలోని ఏవో కతిజున్ కుప్రా కు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు వినతి పత్రాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో సర్వేనెంబర్ 650లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి అని, గతంలో ప్లంబర్స్ కు కేటాయించిన ఈ భూమి తమదని పట్టణానికి చెందిన మరో వ్యక్తి కోర్టునాశ్రయించడంతో కోర్టు కూడా ప్లంబర్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చినట్లు తెలిసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తీర్పు రాగా ప్లంబర్ ఆ సోసియేషన్ లోని కొందరు వ్యక్తులు అప్పటి అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తోటి ప్లంబర్లకే కుచ్చుటోపి పెట్టేశారు అని తెలిపారు.650 సర్వే నెంబర్లు ప్లంబర్స్ అందరికీ కావలసినంత స్థలం ఉన్నప్పటికీ,గత ప్రభుత్వం పెద్దలతో కుమ్మక్కై ప్లంబర్స్ లోని యూనియన్ నాయకులు ఎవరికి అందిన కాటికి వారు దోచుకోవడం జరిగిందన్నారు. దీంతో ప్లంబర్స్ లోని అసలైన అర్హులకు మొండి చేయి చూపి, వారిని వీధిన పడేలా చేయడం దారుణమన్నారు. ప్లంబర్స్ స్టేషన్ నాయకులు , కొందరు వైసిపి నాయకులు ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న విలువైన స్థలాలను నొక్కేయడంతోపాటు మిగిలిన స్థలాలన్నీ తమ వర్గీయులకే అందేలా చేసుకోవడం జరిగిందని వారు మండిపడ్డారు. ప్లంబర్స్ లోని అర్హులందరికీ ఈ స్థలాన్ని కేటాయించాల్సింది పోయి ఇష్టరాజ్యంగా పంపకాలు నిర్వహించారు అని తెలిపారు. 2024 సంవత్సరం ఎన్నికల సమయంలో ధర్మవరానికి వచ్చిన ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్ అప్పటి అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి , ప్లంబర్స్కిచ్చిన పట్టాలలో డబ్బులు వసూలు చేసి, ఎవరికి పడితే వారికి పట్టాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. కోర్టులో ఉన్నటువంటి కేసు కూడా పక్కదోవ పట్టించి, భూ యజమానులకే పట్టాలిస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది అని తెలిపారు. ఇప్పటికే భూ యజమానులు అంతా కలిసి కోర్టును ఆశ్రయించడం జరిగింది అని తెలిపారు. ఈ పట్టాల పంపిణీలో జరుగుతున్న అవినీతికి అక్రమాలపై ఉన్నత స్థాయిలో విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్లంబర్స్ లో మిగిలిపోయిన కార్మికులందరికీ న్యాయం చేయాలని వారు తెలిపారు. ప్రధానంగా ఇక్కడ పట్టాలు పొందిన వారు ఒకరైతే నిర్మాణాల్లో మరో ఉండడం చూస్తుంటే ఇక్కడ భారీ ఎత్తున అవినీతి కుంభకోణానికి దారి తీసినట్లు స్పష్టంగా తెలుస్తోంది అని తెలిపారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు ప్లాట్లు కూడా బినామీ పేర్లతో పట్టాలు పొందడం జరిగిందన్నారు. అందులో 21వ నెంబర్ ప్లాట్ ను ఏకంగా అప్పటి తహసిల్దార్ బినామీ పేరుతో రాయించి, భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు వారు ఆరోపించారు. ఈ సర్వే నెంబర్లు ఎవరెవరికి పట్టాలి కేటాయించారు, ప్రస్తుతం ఆ స్థలంలో ఎవరు కొనసాగుతున్నారని విషయంపై కూలంకసంగా విచారించి, చర్యలు తీసుకోవడం ద్వారా అసలైన లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, సిపిఐ నాయకులు నాగభూషణ, సన్న పెద్దన్న, నారాయణ, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు