Thursday, March 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅసౌకర్యంగా పామిడి ఆర్టీసీ బస్టాండ్…

అసౌకర్యంగా పామిడి ఆర్టీసీ బస్టాండ్…

పామిడి ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో అక్రమ వ్యాపార 30 షెడ్డులు

సిపిఐ నాయకులు కె.రహీం

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి ఆర్టీసీ బస్టాండ్ అసౌకర్యంగా ఉన్నందున ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి అన్నారు. పామిడి మండల కేంద్రంలోని గురువారం పామిడి ఆర్టీసీ బస్టాండ్ లో సిపిఐ పార్టీ పరిశీలన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.సీపీఐ నాయకులు కే.రహీం పాత్రికేయల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ రెండు ఎకరాల విస్తీర్ణంతో ఆగస్టు 20- 1991 లో భవన నిర్మాణ శాఖ మాత్యులు జెసి దివాకర్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.ఆనాటి నుంచి ప్రయాణికులకు సౌకర్యంలోకి ఆర్టీసీ బస్టాండ్ ను అధికారులు ప్రయాణికుల సౌకర్యానికి తీసుకొని రాలేదు.24 గంటలు రద్దీగా ఉండే బస్టాండ్, పామిడి మండలాన్ని రెండవ బాంబేగా కొలుస్తున్నారు ఎందుకంటే నిరంతరం నిరుపేదల నుండి మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇక్కడ బట్టలు దొరుకుతున్నాయి అందుకోసం ఇతర ప్రాంతాలు అనంతపురం, కర్నూలు, బళ్ళారి మీదుగా వెళ్లాలన్న మండలంలోని పలు గ్రామాలు, పక్క మండలంలోని గ్రామాలకు వెళ్లాలన్న ప్రధానమైన ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు పామిడి ఆర్టీసీ బస్టాండ్ నుండి బ్రిడ్జి వరకు అక్కడక్కడ ప్రజలు ఎండకు నిలబడి, వచ్చే, పోయే బస్సులకు. ఆపి ఎక్కుతున్నారు.
ప్రయాణికులకు సౌకర్యంగా ఉండాల్సినటువంటి ఆర్టీసీ బస్టాండ్ కొంతమంది వ్యాపారస్తులకు నిలయంగా మారింది.దాదాపుగా 30 షెడ్లు పైనే నిర్మాణం వేసుకొని వెల్డింగ్ షాపులు మెకానిక్ షాపులు టైలరింగ్, కంప్యూటర్ మొదలగు షాపులను తయారు చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు.వీరందరికీ సహాయం అందిస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు.
కాబట్టి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా రెండు ఎకరాల చుట్టూ కాంపౌండ్, మెట్లు ఫ్యాన్లు, మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షాన ఈ విషయం జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ సెల్ లో ఈ సమస్యను వివరిస్తామని తెలిపారు.అలాగే శనివారం గుంతకల్లు ఆర్టీసీ డిఎం పామిడి బస్టాండ్ కు విచేస్తాను అని సీపీఐ నాయకులకు చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఓంకార్, మహిళా సమైక్య నియోజకవర్గ నాయకురాలు సారాభి, సిపిఐ నాయకులు శివన్న,గఫూర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు