సాకే వినయ్ కుమార్ బిఎస్పి ఇంచార్జి ధర్మవరం
విశాలాంధ్ర -ధర్మవరం: యసి లో ఉప కులమైన బెడ బుడగ జంగం అనే కులానికి అంధ్రప్రదేశ్ లో ఇంతవరకు కుల సర్టిఫికెట్ ఇవ్వలేదని వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ ధర్మవరం బీఎస్పీ పార్టీ ఇన్చార్జ్ శాఖ వినయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం లో నివసిస్తున్న బెడ బుడగ జంగం ప్రజలను ఏపీ ఎంఆర్ఎఫ్, వడ్డెర సంఘం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కలిసి కుల సర్టిఫికెట్ కోసం వారు చేయబోయే పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల గడిచినప్పటికీ ఇంకా కుల సర్టిఫికెట్ లేదని విషయం చాలా విచారకరమని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని గుర్తించి వెంటనే బేడ బుడగ జంగం కుల సర్టిఫికెట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ జాతి బిడ్డలని చదువుకోవాలంటే పదో తరగతి చదివిన తర్వాత చదువుకోవడానికి చాలా ఇబ్బందులు కి గురి అవుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకాలైనా విద్యార్థి కలిసి ఎటువంటి కూడా వీళ్ళకి వర్తించవు అని, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 80,000 మందికి పై చిలుకుగా ఎస్సీ 59 కులలో బేడా బుడగ జంగం కులం ఉందని వారు తెలిపారు,గతంలో 2012 వరకు కూడా ఈ కుల సర్టిఫికెట్లు ప్రభుత్వం మంజూరు చేయడం మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. 2013 ఆ సమయంలో ఈ కులం అనేదే ఆంధ్రప్రదేశ్ లేదని రాష్ట్రప్రభుత్వం ఈ కుల సర్టిఫికెట్లు రద్దు చేయడం జరిగిందన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అని, వీళ్ళని గుర్తించి జారీ చేయాలి అని డిమాండ్ చేశారు..చేయలేదంటే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముట్టడి చేపడతామని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్కడున్నా ప్రజలు వారు పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరం మా లాగా ఉండకూడదని ప్రభుత్వం వాళ్లపై దయ తలిచి క్యాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని వారు తెలిపారు.
బేడా బుడగ జంగం కులం వారికీ ప్రభుత్వం వెంటనే యసి సర్టిఫికెట్ మంజూరు చేయాలి..
RELATED ARTICLES