ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సందీప్
విశాలాంధ్ర -ధర్మవరం : ఎస్బిఐ హర్గర్ లక్ పతి డిపాజిట్ స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ డిపాజిట్ వివరాలను తెలియజేస్తూ మూడు సంవత్సరాల డిపాజిట్ స్కీమ్లో ప్రతినెల 2500 చొప్పున మూడు సంవత్సరాలు కట్టిన యెడల ఒక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ తో పాటు రావడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ డిపాజిట్ స్కీమ్లో ప్రతినెల రూ.1407 చొప్పున ఐదు సంవత్సరాలు కడితే వడ్డీతో కలిపి లక్ష రూపాయలు వస్తుందని తెలిపారు. తదుపరి ఏడు సంవత్సరాల డిపాజిట్ స్కీములో ప్రతినెల రూ.938 లు కడితే ఒక లక్ష రూపాయలు, అదేవిధంగా 10 సంవత్సరాల డిపాజిట్ స్కీములు ప్రతినెల రూ.591 కడితే ఒక లక్ష రూపాయలు వడ్డీతో పాటు వస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన ఎస్బిఐ శాఖలో సంప్రదించవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సామాన్య, మధ్య తరగతి కుటుంబ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.