Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ 15 న ధర్నా

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ 15 న ధర్నా

జగ్గయ్యపేట : కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జగ్గయ్యపేట నియోజకవర్గ సమితి సమావేశం కోదాడ రోడ్డు లోని డిపో సెంటర్ లో ఉన్న సీపీఐ పార్టీ కార్యాలయం ఁపిల్లలమర్రి భవన్ఁ లో జరిగింది. నియోజకవర్గ సహాయ కార్యదర్శి కె.బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు పలు తీర్మానాలు చేశారు. గత మంత్రి వర్గ సమావేశంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం తీర్మానాలు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు తో పాటు ఇళ్ళు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.వీటిని వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దీనిలో భాగంగా ఈనెల 15వ తేదీన జగ్గయ్యపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద అర్జీ దారులతో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో నియోజకవర్గంలోని అర్జీ దారులతో పాటు దేవదాయ భూముల బాదితులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సిపిఐ తరఫున పోటీ చేసి గెలుపొందిన అమరజీవి కామ్రేడ్.పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కాంస్య విగ్రహాన్ని డిపో సెంటర్ లోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేశారు. అదేవిధంగా దీర్ఘకాలంగా సీపీఐ పట్టణ కార్యదర్శిగా పనిచేసిన దివంగత కామ్రేడ్. మహమ్మద్ మన్సూర్ జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించేందుకు తీర్మానం చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని తీర్మానం చేశారు. సభ్యత్వాలను పెంచాలని, కార్మిక సంఘాలను కూడా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శులు మాశెట్టి రమేష్ బాబు, మహమ్మద్ అసదుల్లా,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కరిసే మధు,సీనియర్ సభ్యులు భోగ్యం నాగులు, వత్సవాయి మండల కార్యదర్శి షేక్ జానీ సభ్యులు మెటికల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు