ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామములో ఉండు మాల కులస్తులకు స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మాల మహానాడు సంఘం నాయకులు సమతా సైనిక అధ్యక్షులు శ్రీనివాసులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఓబులేసు, విజిలెన్స్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు రామన్న, ఏలుకుంట్ల గ్రామ బాధితులు ప్రకాష్, తదితరులు ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 94, విస్తీర్ణం 0.86 సెంట్లు వంక పోరంబోకు లో గల మాల కులస్తులకు చెందిన స్మశాన వాటిక కు సర్వే చేయించి హద్దులను ఏర్పర్చి ప్రక్కన ఉన్న ఏ అమర్ నారాయణ కుమారుడు రామనాయుడు నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు. 1956 నుండి బుక్కపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డులలో వంక బోరంబోకుగా ఉన్నదని ప్రస్తుతం 2025 వరకు ఇంకా పోరంబోకులై ఉన్నదని వారు గుర్తు చేశారు. రామానాయుడు ఆ సర్వే నెంబర్ స్థలం మాకు సంబంధించిన భూమి అని, ఇక్కడ ఎవరూ కూడా ఖననం చేయరాదని ప్రతిసారి అడ్డగిస్తున్నారని తెలిపారు. గ్రామ పెద్దలు కలగజేసి వారికి సర్ది చెప్పినా కూడా స్మశాన వాటికకు అడ్డుపడుతున్నారని తెలిపారు. గతంలోని ఆర్డీవో, ఎమ్మార్వో కు సమస్య తెలిపినాము అని, వారు 30 సెంట్లు స్థలమును మండల సర్వేయర్ ద్వారా కొలత వేయించి హద్దులు ఏర్పరిచి స్మశాన వాటికకు స్థలం చూపించడం జరిగిందన్నారు. కానీ మరుసటి రోజే అమరనారాయణ వారి కుమారుడు రామానాయుడు హద్దులను రాళ్ళను తొలగించడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. జిల్లా ఎస్పీకు, రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, మీ సమక్షంలో మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలుకుంట్ల గ్రామ మాల కులస్తుల తో పాటు జిల్లా, రాష్ట్ర మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
మాల కులస్తులకు స్మశాన వాటికను ఏర్పాటు చేయండి
RELATED ARTICLES