జ్యోతి స్వరూప అయ్యప్ప సేవా కమిటీ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని శాంతినగర్ గంగమ్మ గుడి దగ్గర గల జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి దేవాలయంలో జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి వారి స్థిరబింబ, అష్ట బంధన ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవ వేడుకలు అయ్యప్ప సేవా కమిటీ, భక్తాదులు, దాతలు, ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా కమిటీ వారు మాట్లాడుతూ ఈ మహోత్సవ వేడుకలు ఈనెల నాలుగవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించామని తెలిపారు. గంగపూజ, గోపూజ యాగశాల ప్రవేశం రక్షాబంధన, హోమాలు, వేద పారాయణం, ప్రధాన కుంభారాధన, యంత్ర స్థాపన, అయ్యప్ప స్వామి వారి మాల మంత్ర హోమం, మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా అర్చకుల నడుమ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం హిందూపురం ఏఎస్. సునీల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి పోలంకి రవీంద్ర ,గోపాల్ నాయక్, అయ్యప్ప స్వామి భక్తాదులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన కుంబాభిషేక మహోత్సవ వేడుకలు..
RELATED ARTICLES