జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై 10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సాధారణ ఎన్నికలు- 2024 అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి తాడిపత్రిలో 7 కేసులు నమోదు కాగా, అందులో 5 కేసులుకు సంబంధించి చార్జిషీట్ ఫైల్ చేయడం జరిగిందని, 1 కేసు ఫాల్స్ కేసు అని, మరొకటి అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందన్నారు. ఎలక్షన్ కమీషన్ పోర్టల్ ఓపెన్ కావడం జరిగిందని, చార్జిషీట్ దాఖలులో పోలీస్ వారికి అవసరమైన సంపూర్ణ సహకారం అందించాలని ఆర్డీఓ, తహసిల్దార్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి నమోదైన కేసులకు సంబంధించి త్వరితగతిన చార్జిషీట్ ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీఓ కేశవనాయుడు, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి దేవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, పోలీస్ శాఖ డిసిఆర్బి హరినాథ్, తాడిపత్రి టౌన్ సిఐ సాయికృష్ణ, తాడిపత్రి తహసీల్దార్ రజాక్ వలి, తదితరులు పాల్గొన్నారు.