రెవెన్యూ శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తండా కు చెందిన గిరిజన భూ సమస్యలను పరిష్కరిస్తూ వెనివెంటనే తగిన చర్యలను గైకొనాలని కోరుతూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అడవి బ్రాహ్మణపల్లి తండాలో గిరిజనుల భూ సమస్యపై కొన్ని పత్రికలు ప్రచురితం చేయడం జరిగిందని, ఈ సమస్యపై ఈ నెల నాలుగవ తేదీన నాతో పాటు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తదితరులతో కూడిన సిపిఐ బృందం అడవి బ్రాహ్మణపల్లి గిరిజనులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ కాలములో ముదిగుబ్బ మండల బిజెపి నాయకుడైన ఆదినారాయణ యాదవ్ తో పాటు వైసిపి కి చెందిన శ్రీ ప్రభాకర్ రెడ్డి ఎం శాంతమ్మ సుకన్య కుమ్మక్కై ముదిగుబ్బ మండలంలో గిరిజనుల సాగులో ఉన్న దాదాపు 200 ఎకరాలకు పైబడి భూములను రెవెన్యూ రికార్డులలో (1బి, అడంగల్) అక్రమంగా వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చిలమత్తూరు మండలం సోమగట్ట రెవెన్యూ గ్రామ పొలములో సర్వేనెంబర్ 24 నుండి 34 వరకు దళితులు బీసీలకు కేటాయించిన అసైన్మెంట్ భూములు దాదాపు 73 ఎకరాలను ముదిగుబ్బ ప్రస్తుత ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తన కుటుంబ సభ్యుల పేరున వన్ బి అడంగల్ అక్రమంగా నమోదు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు రుణాలు కూడా పొంది ఉన్నారని, దళిత గిరిజనులకు చెందిన వందల ఎకరాల భూములలో బిజెపి వైసిపి నాయకులు అక్రమాలకు పాల్పడి, కోట్లాది రూపాయల రుణం తీసుకోవడమే గాక రైతులకు వర్తించే రుణమాఫీ బీమా తదితర పథకాలను కాజేయడం జరిగిందని తెలిపారు. కావున అడవి బ్రాహ్మణపల్లి గిరిజనుల భూ సమస్యను పరిష్కరించి వారికి తగు న్యాయం చేయవలసినదిగా కోరడం జరిగిందని, అక్రమాలకు పాల్పడిన బిజెపి వైసిపి వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు చేపట్టవలసినదిగా కోరడం జరిగిందని తెలిపారు.
అడివి బ్రాహ్మణపల్లి తండా గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించండి..
RELATED ARTICLES