Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు ట‌న్నెల్..17వ రోజుకి చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్.. న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు ట‌న్నెల్..17వ రోజుకి చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్.. న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు ట‌న్నెల్ కూలిన ప్ర‌మాదంలో చేప‌ట్టిన రెస్క్యూ ఆపరేషన్ నేటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన విషాద ఘటనతో 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ , క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం డీ1, డీ3 ప్రాంతాల్లో 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇనుప ప్లేట్లు, రాడ్స్ అడ్డుగా ఉండటంతో ప్లాస్మా కట్టర్ల సాయంతో వాటిని కత్తిరిస్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు