ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో కూటమికి చెందిన మిగిలి నలుగురు అభ్యర్థులు ఈ మధ్యాహ్నం నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, ఏపీలో మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఏపీలో నామినేషన్లు దాఖలు చేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
RELATED ARTICLES