Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘంటసాల వర్ధంతి సభను జయప్రదం చేయండి.. కళాజ్యోతి

ఘంటసాల వర్ధంతి సభను జయప్రదం చేయండి.. కళాజ్యోతి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఈ. సి. ఆర్.ఆర్ సరస్వతి నిలయం, కళాజ్యోతిలో ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కళా జ్యోతి ప్రాంగణమునందు పద్మశ్రీ గంటసాల వర్ధంతి సభను నిర్వహిస్తున్నట్లు కళాజ్యోతి కార్యదర్శి బాల గొండరామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వర్ధంతి సభకు అధ్యక్షులుగా కళాజ్యోతి సంస్థ అధ్యక్షులు కుంటిమల నారాయణ, ముఖ్య అతిథిగా ధర్మవరం- డి.ఎస్.పి హేమంత్ కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. తదుపరి రాత్రి 7 గంటలకు ప్రముఖ గాయకులు బాల కామేశ్వరరావు- హైదరాబాద్, గాయనీ గాయకులు బాల కామేశ్వరరావు- హైదరాబాద్, వీరలక్ష్మి- గుంతకల్, జ్యోతి- అనంతపురం వారిచే ఘంటసాల పాటల కచేరి నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు ఘంటసాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు