విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయని హెడ్మాస్టర్ సీతాపతి, ఇన్చార్జి హెడ్మాస్టర్ భువనేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల సాధన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులు సరస్వతి పూజను నిర్వహించారు. ఈ పూజకు ముఖ్యఅతిథిగా బిఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చదువుకు ఎంతో మంచివిలువ, ప్రాధాన్యత ,మంచి గుర్తింపు ఉందని తెలిపారు. చదువుకునేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదల ,తపన ఉండాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు అతి దగ్గరలో ఉన్నందున ఆటలకు, సెల్ ఫోన్లకు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు గురువులు చెప్పిన విధంగా చదువుపై ధ్యాస ఉంచాలని తెలిపారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ముగిసేంతవరకు చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోరాదని తెలిపారు. తొలుత సరస్వతీ చిత్రపటానికి విద్యార్థులు పూలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుల, ముఖ్య అతిథి యొక్క ఆశీస్సులను కూడా పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే సత్ఫలితాలు వస్తాయి.. హెడ్మాస్టర్ సీతాపతి
RELATED ARTICLES