మంత్రికి సూచన చేయడం తప్పా..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ను విమర్శించే స్థాయి నీది కాదు
-శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర పుట్టపర్తి:- హరీష్ కుమార్ మాట అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సాయి ఆరామం లో వేమయ్య యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 3తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని పత్రికలలో కథనాలు వచ్చాయని చెడ్డ పేరు వచ్చే వ్యక్తులను దగ్గర పెట్టుకోవద్దని సలహా ఇచ్చాడన్నారు. మార్చి 4వ తేదీ అడవి బ్రాహ్మణి పల్లి తండాలో రామకృష్ణ పర్యటించగా తాండలోని గిరిజనుల భూములను ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనుచరుల పేర్లతో పాసుబుక్కులను చేయించుకున్నాడన్నారు. గిరిజనులు దరఖాస్తు చేసుకున్న పత్రాలను రోడ్లపై విసిరి వేయడం జరిగిందన్నారు. విజయవాడలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వాట్సప్ లో సమాచారం పంపగా, తక్షణం జరిపి జరిపినందుకు సిపిఐ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గిరిజనుల భూములపై ఆదినారాయణ అనుచరులు బ్యాంకులలో లోన్లు తీసుకోవడం జరిగిందన్నారు. ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం చెందిన క్రషర్ యజమాని లక్ష్మీనారాయణ ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారని, తాము చెప్పిన చోటే కంకర కొనాలని సైట్ ఇంజనీర్లులను బెదిరించాడన్నారు. ఆదినారాయణ యాదవ్, లక్ష్మీనారాయణ మూడువేల కోట్లు ఆపే యత్నం ఎవరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నామన్నారు. అడవి బ్రాహ్మణపల్లి తండా యోగివేమన జలాశయం నిర్మాణంలో భూములు గిరిజనలు గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గుట్టలు మిగులు భూముల్ని చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారని, మూడు దశాబ్దాలుగా వాటి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. గిరిజనులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆదినారాయణ యాదవ్ ఆ భూముల్లో చాలా వరకు తన కుటుంబ సభ్యులు ,బంధువుల పేర్లతో ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగిందన్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులు బిసి ఎమ్మెల్యే సత్య కుమార్ కు ఓట్లు వేయడం జరిగిందని, చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులు ఇబ్బందులను కూటమిలో ఉన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు తెలపగా, ఆయన చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో పదివేల మందిలో ఎవరి వసూళ్ల మామూలుగా గుర్తు రావడం లేదా హరీష్ అన్నారు. ధర్మవరంలో వ్యాపారస్తులను హరీష్ కుమార్ బెదిరింపులకు గురిచేస్తున్నాడన్నారు. సిపిఐ పార్టీ పేదల పక్షాన నిలబడుతుందని, గిరిజన తాండవాసులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, ధర్మవరం నియోజకవర్గం మధు, పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, పెనుగొండ నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు, పుట్టపర్తి పట్టణ కార్యదర్శి వినోద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మహిళా సమైక్య జిల్లా నాయకులు జయలక్ష్మి, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, నల్లమడ మండల కార్యదర్శి రమణ, ధర్మవరం పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, చేనేత జిల్లా అధ్యక్షుడు పోలా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.